వరికుంట‌పాడు జ‌న్మ‌భూమిలో జ‌గ‌డం

244

The bullet news (Udayagiri)_ ఆ మండలంలో జన్మభూమి అన్నా.. ప్రభుత్వ పరంగా జరిగే ఏదైనా జనం సభ అన్నా అధికారులకు హడలే.. అధికార పార్టీ నేతలే అడ్డం తిరుగుతారు.. ఆ పై వారికి వారే పరస్పరం వాదులాడుకుంటారు.. సందిట్లో సడేమియా అంటూ ప్రతిపక్ష పార్టీ ఎంటరవుతుంది.. అంతే సభ గాలికి.. అధికారులు ఇంటికి.. ఇంతకీ ఈ విచిత్ర పరిస్థితి ఎక్కడ..? అయితే మీరు ఈ గొడవ చూడాల్సిందే..

ఇది నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని ఉన్న వరికుంటపాడు మండలం. అధికార టీడీపికి ఈ మండలం పెట్టని కోట.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపుగా ఏకపక్షమే.. ఓ ప్రధానమైన సామాజిక వర్గం పూర్తిస్థాయి బలం కల్గిన మండలమిది.. ఈ బలమే ఇక్కడ ఆదిపత్య పోరాటానికి తెరలేపుతోంది.. ప్రతి గ్రామంలో ఓకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపులుంటాయి.. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటారు.. ఒకరు పథకాన్ని అమలు చేస్తుంటే.. మరొకరు లొసుగులు లేవనెత్తుతారు.. ఇక్కడే రగడ మొదలవుతుంది.. తాజాగా ఇవాళ జరిగిన జన్మభూమి ఇలాంటి వివాదానికే తెరలేపింది. ఇదిలా ఉండగానే అధికార పార్టీకి చెందిన మండల కన్వీనర్ ను అధికారులు స్టేజీ మీదకు ఆహ్వానించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ అడ్డుచెప్పింది..

అనధికార ప్రతినిధిని స్టేజిమీదకెందుకు ఆహ్వానించారంటూ వైసీపీ అభ్యంతరం చెప్పింది.. గ్రామస్తులు లేకుండా గ్రామసభేందంటూ వైసీపోళ్లు.. నిలదీశారు.. దీనిపై అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది.. ఇది కాస్త రగడను పెంచింది.. అంతే గొడవ స్టాట్ అయింది. జన్మభూమి కోసమేసిన టెంటులు కూలదోశారు.. వాటిని చించేశారు.. దీంతో చేసేదేమీ లేక అధికారులు పైల్స్ సంకలో పెట్టుకుని ఇంటికి వెళ్లిపోయారు.. చివరగా సినిమా తరహాలో పోలీసులు ఎంటరై ఇరువర్గాలను సర్దిచెప్పి అక్కడి నుంచే పంపేశారు. దీనిపై వైసీపీ సర్పంచ్ వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకుల ఎలా నిలదీశారు

SHARE