ఈత సరదా… ఇద్దరు విద్యార్థులు మృతి

132

THE BULLET NEWS (VARIKUNTAPADU)- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామదేవుల పాడులో ఈతకెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.

సరదా కోసం ఈతకెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన వరికుంటపాడు మండలం రామదేవుల పాడు లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడిపూడి వినయ్(17) యాళ్ల చంద్రమౌళి (16) గ్రామ సమీపంలోని పిల్లాపేరు వాగులో సరదాగా కోసం ఈతకెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు.గమనించిన గొర్రెల కాపరులు కుటుంబ సభ్యుల కు సమాచారం అందించగా ఘాటనా స్థలంకు చేరుకొని విద్యార్థుల మృత దేహాలను వెలికితీసి స్వగృహాలకు తరలించారు. విద్యార్థులు మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

SHARE