‘సూపర్’ పంజాబ్.. ఉత్కంఠ పోరులో విజయం!

35

The bullet news (Cricket) – సయ్యద్ ముస్తాక్ అలీ సూపర్‌లీగ్‌‌లో పంజాబ్ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకంది. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠకర మ్యచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టాపోయి 158 పరుగులు చేసింది. కర్ణాటక బ్యాటింగ్‌లో అనిరుధ్ 40, కెప్టెన్ గౌతమ్ 36 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులే చేసింది. దీంతో ఇరు జట్ల స్కోర్ సమం అయింది. పంజాబ్ బ్యాటింగ్‌లో మన్‌దీప్‌సింగ్ 45, కెప్టెన్ హర్భజన్ 33, యువరాజ్ 29 పరుగులు చేశారు. దీంతో జట్టు విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అడించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15 పరుగులు చేసింది. మన్‌దీప్ 10, యువరాజ్ 5 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బౌలర్ సిద్ధార్త్ కౌల్ ధాటికి 1 వికెట్ కోల్పోయిన కర్ణాటక 11 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ ఉత్కంఠపోరులో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

SHARE