పార్ల‌మెంట్ లో వాల్మీకి ఎస్టీ బిల్లుకు మ‌ద్ద‌తివ్వండి సార్.. – నెల్లూరుజిల్లాలో జ‌గ‌న్ ను క‌లిసిన వాల్మికి నాయ‌కుడు సునీల్

111

The bullet news (Kavali)_ నెల్లూరు జిల్లా ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట యువజన విభాగం వాల్మీకి నాయకులు కావలి సునీల్ కలిశారు.. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలంలో కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బీవై రామయ్య ఆద్వర్యంలో జగన్ ను కలిసిన ఆయన వాల్మీకులు స్థితిగతులను వివరించారు.. బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చుతూ తెలుగుదేశం ప్రభుెత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో వైసీపీ ఎంపీలు వాల్మీకి ఎస్టీబిల్లుకు మద్దతు ఇచ్చేలా చూడాలని జగన్ ను కోరారు.. ఈ సందర్భంగా జగన్ సునీల్ కు హామీ ఇచ్చారు.. వాల్మీకుల స్థితిగతులు తనకు బాగా తెలుసనీ, నాన్నగారి హాయాంలో ఆ ప్రతిపాదనలు ఉన్నాయని, తాను కూడా మేనిపెస్టోలో పొందుపరిచానని ఖచ్చితంగా మద్దతిస్తామని జగన్ అన్నారు..దీంతో సునీల్ వైసీపీ అదినేత జగన్ కు కృత‌జ్ణ‌త‌లు తెలిపారు..

SHARE