శబరిమలలోకి మహిళల ప్రవేశానికి ఓకే…

128

THE BULLET NEWS :-శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఆర్ నారిమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పు ఇచ్చింది. . ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలని… వివక్ష ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. దేవతలను పూజిస్తూ మహిళలను గౌరవించకపోవడం సరికాదంది. దేశంలోని మిగతా ఆలయాలతో పోలిస్తే శబరిమలలో నిబంధనలు భిన్నంగా ఉంటాయి. అయ్యప్పను పూజించే విషయంలోనూ… దర్శనం చేసుకునే విషయంలోనూ… స్త్రీలపై ఆంక్షలున్నాయి. 10  ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు మహిళలకు ఆలయంలోకి అనుమతి లేదు. ఆలయ ప్రస్తావం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నిబంధనను దేవస్థానం బోర్డు అమలు చేస్తోంది. అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి… నెలసరి వచ్చే మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించారు. కేరళ ధార్మిక చట్టాల ప్రకారం ఇది అమలవుతోంది. పదేళ్ల లోపు చిన్నారులకు… 50 ఏళ్లు దాటి రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు మాత్రమే మాలదారణ చేసే అవకాశం ఉంటుంది. శబరిమలలో అమలవుతోన్న ఈ విధానంపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. దేవుడి ముందు అంతా సమానం అయినప్పుడు… శారీక అంశాల ఆధారంగా మహిళలపై నిషేధం ఎలా విధిస్తారని సామాజిక వాదులు వాదిస్తూ వచ్చారు.

SHARE