స‌ర్వే అంటూ వ‌చ్చారు.. స‌రుడు లాక్కెళ్లారు..

165

The bullet news (Manubolu)_ సినిమా సీన్ త‌ల‌పించే రీతిలో ఇద్ద‌రు యువ‌కులు ఓ మ‌హిళ మెడ‌లో నుంచి స‌రుడు లాక్కెళ్లారు.. ఈ ఘ‌ట‌న నెల్లూరుజిల్లా మ‌నుబోలు బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై స‌ర్వే చేస్తున్నామంటూ ఇద్ద‌రు యువ‌కులు గ్రామంలోకి ప్ర‌వేశించి ఇంటింటికి తిరిగారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయా అంటూ ఆరా తీస్తూనే రెక్కి నిర్వ‌హించారు.. అదును చూసి సుగుణ‌మ్మ అనే మ‌హిళ మెడ‌లో ఉన్న స‌రుడును లాకెళ్లారు.. బాధితురాలు తేరుకునే లోపే బైక్ పై అక్క‌డి నుంచి యువ‌కులు ఉడాయించారు.. ల‌బోదిబోమ‌న్న బాధితురాలు పోలీసుల‌కు పిర్యాదు చేసింది.. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు..

SHARE