పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. – హెచ్ ఎం మరుద్వతి

151

The bullet news ( Nellore ) :-  వినాయక చవితి పురస్కరించుకుని వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాలెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లో బుధవారం విద్యార్థిని విద్యార్థులు వారి సృజనాత్మకత తో వినాయకుని బొమ్మలను తయారు చేశారు.. బంక మట్టితో పాటు కూరగాయలు, గోధుమ పిండి,ఆకులు వంటి ఇతర ప్రకృతి హితమైన వస్తువులతో విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా వినాయక బొమ్మలను అందంగా తయారు చేశారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేస్తు స్వచ్ఛభారత్ లో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది..ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరుద్వతి , ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో పాల్గొన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు..

SHARE