జిల్లా రైతులకు సోమిరెడ్డి తీపి కబురు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే బీపీటీ ధాన్యం కొనుగోలు..

55

THE BULLET NEWS (AMARAVATHI)-

నెల్లూరుజిల్లా రైతాంగానికి వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీపికబురు
అందించారు.. జిల్లాలో బీపీటీ ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు
తెరపడింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. విరుగుడు పేరుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన
సీఎం చంద్రబాబు  రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచే బీపీటీ
ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి సివిల్ సప్లయిస్ అధికారులు
గోదాముల్లో నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. విరుగుళ్లు ధాన్యాన్ని సైతం ప్రభుత్వం
ప్రకటించిన క్వింటాలు రూ.1,800, పుట్టి రూ.15,300కి కొనుగోలు చేయనున్నారు. ఎన్ని
పుట్ల ధాన్యాన్ని అయినా కొనుగోలు చేయనున్నారు. మంత్రి సోమిరెడ్డి  ప్రత్యేక చొరవతో
వెలువడిన ఈ నిర్ణయంతో జిల్లా రైతులకు ఊరట లభించనుంది..
SHARE