the bullet news(hyderabad)- మిల్కీ బ్యూటీ చూడడానికి ఎంతో సుకుమారంగా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయే రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అందానికి తోడు తమన్నాకు ఓపిక కూడా ఎక్కువే అంటారు సినీ జనాలు. ఒక షాట్ బాగా రావడానికి ఎంతో కష్టపడుతుంది అంటారు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న తమన్నాలో ఓ వీక్పాయింట్ కూడా ఉంది. అదేమంటే ఆమెకి ఎత్తయిన ప్రదేశాలంటే చచ్చేటంత భయమట. షూటింగ్ సమయంలో ఎత్తయిన ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే కళ్ళు మూసుకుని ఉండిపోతుందట. ఎంత రాత్రయినా చీకట్లో వెళ్ళమంటే వెడతాను కానీ, కొండ పైభాగం దాకా వెళ్ళమంటే మాత్రం వెళ్ళనని చెబుతోంది తమన్నా.