ఎర్ర‌దొంగ‌ల‌పై టాస్క్ “పోర్స్ ” – 14 మంది అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్లు అరెస్టు

113

The bullet news (Nellore)- ఎర్ర‌చంద‌నం అక్ర‌మార్కుల‌పై టాస్క్ పోర్స్ పంజా విసురుతోంది.. నిరంత‌ర నిఘాతో దాడులు నిర్వ‌హిస్తూ స్మ‌గ‌ర్ల భ‌ర‌తం ప‌డుతోంది.. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగుతున్న టాస్ప్ పోర్స్ టార్గెట్ ను రీచవుతోంది.. అక్రమ రవాణాను నియంత్రిస్తూ విలువైన సంపదను కాపాడుతోంది.. ఇవాళ రాపూరు, ఉదయగిరి, మర్రిపాడు మండలాల్లోని స్మగర్లపై నిఘా ఉంచిన పోలీసులు దాదాపు 14 మంది స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్టు చేశారు.. ఓఎస్డీ క్రైమ్ విఠ‌లేశ్వ‌ర్ ఆధ్వ‌ర్యంలో దాడులు నిర్వ‌హించి సిద్దంగా ఉన్న కోటిన్న‌ర విలువ చేసే ఎర్ర‌దుంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు.. అరెస్టైన వారిలో నలుగురు క‌డ‌పజ‌ల్లాకు చెందిన స్మ‌గ‌ర్లున్నారు..

SHARE