ద‌ళితుల సంక్షేమానికి టీడీపీ పెద్ద పీట వేస్తోంది.. – కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి

151

The bullet news (Kovuru)-  ద‌ళితుల సంక్షేమానికి తెలుగుదేశంప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తోంద‌ని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు.. చంద్రన్న ముందడుగు -దళిత తేజం కార్య‌క్ర‌మాన్ని విడ‌వ‌లూరు మండ‌లం జాన్ పేట‌లో ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల నుంచి రూ.40ల‌క్ష‌ల‌తో సిమెంట్స్ రోడ్డుల‌ను ప్రారంభించారు.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం గతం లో ఏ ప్రభుత్వం చేయనన్నీ పనులు మా నాయ‌కుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నార‌న్నారు.. ద‌ళితుల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు.. బాబా సాహెబ్ బిఆర్ అంబేద్క‌ర్ ఆశయ సాధన ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడి తోనే సాధ్యమన్నారు. ప్రతీ దళిత వాడ సంపూర్ణంగా అభివృద్ధి చేసినప్పుడే దళితులకు న్యాయం చేసిన వార‌వుతామ‌ని, అంబేద్క‌ర్ కి సరైన గౌరవం ఇచ్చినట్ల‌వుతుంద‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నేత‌లు పాల్గొన్నారు..

SHARE