మహిళపై టీడీపీ నాయకుడి దాడి

134

The bullet news ( Kavali)-  కావలిలో శుక్రవారం ఒక టీడీపీ నాయకుడు చేసిన నిర్వాకం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. కావలి పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ షాపు నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు బాలగురుస్వామి అదే ప్రాంతంలో కూల్‌డ్రింక్స్‌ షాపు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న మహిళ ఫోన్‌నంబర్‌ అడిగాడు. ఆమె ఇవ్వలేదు. ఈ విషయం మహిళ భర్తకు చెప్పడంతో, అతను బాలగురుస్వామి ఇంటికి వెళ్లి ఘటన గురించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపటికి బాలగురుస్వామి, అతని సంబంధీకులు కూల్‌డ్రింక్స్‌ షాపు వద్దకు చేరుకొని భర్త కళ్లెదుటే మహిళను ఫోన్‌నంబర్‌ అడిగిన విషయం భర్తకు చెబుతావా అంటూ దాడి చేశాడు.

భార్యాభర్తలను అసభ్యపదజాలంతో తిట్టారు. రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో స్వైరవిహారం చేస్తున్న బాలగురుస్వామి బ్యాచ్‌ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకొన్నారు. అయినప్పటికీ బాలగురుస్వామి టీడీపీ నాయకుడు కావడంతో పోలీసులను కూడా ఖాతరు చేయకుండా భార్యభర్తలపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధిత మహిళ ఈ ఘటనపై కావలి వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలగురుస్వామికి కావలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మలిశెట్టి వెంకటేశ్వర్లు మద్దతుగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు చేసిన మహిళ, ఆమె భర్తను పోలీసులు పిలిపించి టీడీపీ నాయకుడు బాలగురుస్వామితో రాజీ చేసుకోవాలని, లేకపోతే వారి నుంచి ఫిర్యాదు తీసుకొని మీపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పడం గమనార్హం.

SHARE