వరికుంటపాడు తెలుగు తమ్ముళ్ల బూతు పురాణం

234

The bullet news ( Udaya giri)_  టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీయార్ వర్దంతి నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య కారుచిచ్చు రాజేసింది.. దూషణలకు తెరలేపింది.. ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండల యువనేత శ్రీకాంత్యాదవ్ ను అక్కడి పార్టీ కన్వీనర్ చెప్పరాని భాషలో దూషించారు.. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్చేస్తోంది.. పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదన్న కారణాలు చూపుతూ కన్వీనర్ బ్రహ్మనాయుడు తెలుగు యువత మండలాధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ పై బూతుల వర్షం కురిపించారు.. ఇప్పుడు ఈ వ్యవహారం నెల్లూరుజిల్లా తెలుగుదేశం
పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. కుల సమీకరాలకు తెరలేపుతోంది.. ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న ఉదయగిరి
నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఈ బూతు పురాణంతో తారాస్థాయికి చేరింది.. అది కాస్త జిల్లా తెలుగుదేశం పార్టీకి చుట్టుకుంది.. అక్కడి ఎమ్మెల్యే అందుబాటులో ఉండటమే గగనం.. తాజాగా తలెత్తిన ఈ వివాదం జిల్లా
పార్టీ కార్యాలయానికి తలనొప్పిగా మారింది.  చిత్తశుద్దితో పార్టీ అభివ్రుద్దికి పాటుపడుతున్నా.. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని శ్రీకాంత్ వాపోయారు.. పార్టీ మండల నాయకులు గుర్తించకపోవడం వల్లే ఎన్టీయార్ వర్దంతి రోజూ ఉదయగిరి వెళ్లి బ్లడ్ డొనేట్ చేశానని ఆయన అన్నారు.. పార్టీమీద, ఎన్టీయార్ మీద అభిమానం ఉండటం వల్లే దూరమైనా ఉదయగిరి వెళ్లి మరీ రక్తదానం చేశానన్నారు.. అలాంటి నాపై మండల నాయకులు దూషించడం బాదకల్గిస్తుందని శ్రీకాంత్ వాపోయారు..

SHARE