టీడీపీ నేత‌లు దాడులు చేస్తారు.. ముఖ్య‌మంత్రి పంచాయ‌తీ చేస్తారు..- ఎమ్మెల్యే కాకాణి పైర్

116

The bullet news (Podalakuru)-  నెల్లూరుజిల్లాలో ప్ర‌భుత్వ అధికారుల‌పై జ‌రుగుతున్నవరుస దాడులు చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమ‌ని వైసీపీ నెల్లూరుజిల్లా అద్య‌క్షులు, సర్వేపల్లి ఎమ్మెల్లే కాకాణిగోవర్ధన్ రెడ్డి విమ‌ర్శించారు.. ఇవాళ పొద‌ల‌కూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అధికారులు తాము చెప్పినట్లు వినకుంటే, బదిలీలు సస్పెన్షన్లు అంటూ బెదిరింపులకు పాల్పడే అధికార పార్టీ నాయకులు మరో అడుగు ముందుకేసి దాడులకు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.. వారం వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై టీడీపీ నాయ‌కులు దాడులు చేయ‌డం హేయ‌మైన చర్య‌న్నారు.. ఆత్మ‌కూరు ఆర్ ఐ జ‌హీర్ పై, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ భాస్కర్ పై దాడులు చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు.. తాము శాస‌న‌స‌భ్యులుగా ఉన్నా.. తామెప్పుడూ ఉద్యోగుల ఆత్మగౌర‌వాన్ని కూడా దెబ్బ‌తీయ‌లేద‌న్నారు.. ఉద్యోగుల‌పై దాడులు జ‌రిగిన స‌మ‌యంలో ఉన్న‌తోద్యోగులు, యూనియ‌న్ నాయకులు వారికి బాస‌ట‌గా నిల‌వాల‌న్నారు. రాజీలు కుదురుస్తూ అధికారుల ఆత్మస్టైర్యాన్ని దెబ్బ తీయడం తగదన్నారు.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అండ‌గా తమ పార్టీ ఉంటుంద‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక వైసీపీ నేత‌లు పాల్గొన్నారు..

SHARE