దుగరాజపట్నం పోర్టు పై టిడిపి నిర్లక్ష్యం – నెల్లూరు లో బిజెపి నాయకులు ధర్నా

127

THE BULLET NEWS (NELLORE)-అధికార టిడిపి పై మిత్ర పక్ష మైన బిజిపి మాటల తూటాలు.. నిరసన గళాన్ని వినిపిస్తోంది..దుగరాజపట్నం పోర్ట్ పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెల్లూరు లో బిజెపి నాయకులు ఆందోళన బాట పట్టారు..దుగరాజపట్నం పోర్ట్ తీరుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఆందోళన నిర్వహించారు.. ఈ సందర్భంగా బిజిపి నాయకులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ని పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ముందుకొస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన కృష్ణపట్నం పోర్ట్ కు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆరోపించారు.. కేంద్ర ప్రభుత్వం పోర్ట్ ఏర్పాటు కు సానుకూలంగా ఉన్నా టిడిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.. పోర్ట్ నిర్మాణము జరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు..

SHARE