బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టిడిపి నాయకుల దాడికి యత్నం.

122

THE BULLET NEWS (CHITTOR)- బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి రావడంపై పచ్చతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాన్ని టిడిపి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను అడ్డుకుంటామని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద నల్లజెండాలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మోడీ – కేడీ..అమిత్ షా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

SHARE