టీడీపీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశా- ఊటుకూరు ఎంపీటీసీ గురజాల వెంకటరమణయ్య

101

The bullet news (Udayagiri)_  పార్టీకి నష్టం కల్గించేవాళ్లకే జిల్లా స్థాయి పదవులు కట్టబెడుతున్నారు.. కష్టపడే వారికి ప్రాదాన్యం ఇవ్వడం లేదు.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ వింజమూరు మండలం ఊటుకూరు ఎంపీటీసీ గురజాల వెంకటరమణయ్య వాపోయారు.. ఆయన మాట్లాడుతూ వింజమూరు మండలంలో టీడీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది.. 2006 నుంచి వింజమూరులో తాను టీడీపీ బలోపేతానికి క్రుషి చేస్తుంటే కొందరి మాటలు విని ఎమ్మెల్యే అసలైన టీడీపీ నాయకులను దూరం పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గతంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, జిల్లా పార్టీ అధ్యక్షుల ద్రుష్టికి సైతం తీసుకెళ్లానని కానీ వారు స్పందించలేదన్నారు.. మనస్థాపం చెంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు..

SHARE