కొండగట్టులో బస్సుబోల్తా… 20 మంది మృతి…

146

THE BULLET NEWS (jagithyala):-జగిత్యాల జిల్లా  కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 20 మందికి పైగా మృతిచెందినట్టు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు లోయలోకి పడిపోయి… ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణం చేస్తున్న 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగగానే ఆ ప్రాంతమంతా వృద్ధులు, పిల్లలు, మహిళల రోధనలతో మార్మోగిపోయింది. తీవ్రగాయాలపాలై… బస్సుల్లో ఇర్కుకుపోయిన వారిని బయటకి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. 20 మంది మృతిచెందగా… మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు… క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు పోలీసులు. మంగళవారం కావడంతో కొండగట్టు అంజన దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

SHARE