నా అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యే… – జగ్గారెడ్డి

174

THE BULLET NEWS (HYDERABAD):-కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు… 2004లో నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించారు పోలీసులు… ఈ కేసులో గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సంగారెడ్డికి చెందిన జెట్టి కుసుమార్, నిజామాబాద్ కి చెందిన మధుసూదన్ రావు వ్యవహారంపై ఆరా తీస్తోంది టాస్క్ ఫోర్స్. జగ్గారెడ్డి అధికార దుర్వినియోగంకి పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు… జగ్గారెడ్డి నుండి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది టాస్క్ ఫోర్స్… కాసేపట్లో వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి… వైద్య పరీక్షల అనంతరం నేడు సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు… టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు… గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాసేపట్లో గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.

కేసీఆర్, హరీష్‌రావు నన్ను జైళ్లో పెట్టించాలనుకున్నారు… అదే చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి… నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు… ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆయనను ఈ రోజు ఉయదం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తరలించిన మండీ పోలీసులు… వైద్య పరీక్షల అనంతరం తిరిగి పీఎస్‌కు తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలో ఎన్టీవీతో మాట్లాడిన జగ్గారెడ్డి… నా అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్నారు.. కేసీఆర్, హరీష్ రావు కలిసి నన్ను జైల్లో పెట్టాలనుకున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ సభ తరువాత నా అరెస్ట్ కు కుట్ర పన్నారని… సిద్దిపేటలో తమ అభ్యర్థిని గెలిపించేందుకే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్, హరీష్ రావు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న జగ్గారెడ్డి… నేను ఎవరిని విదేశాలకు తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై కూడా నకిలీ పాస్ పోర్ట్ కేసులున్నాయన్నారు జగ్గారెడ్డి.

జగ్గారెడ్డి అరెస్ట్‌పై టి.కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు… కేసీఆర్ తొత్తులుగా మారారంటూ విమర్శిస్తున్నారు. రాత్రి తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. గులాంనబీ ఆజాద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, భట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీ, సంపత్‌… కుందన్ బాగ్‌లోని డీజీపీ ఇంటికి వెళ్లారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగ్గారెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్‌ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగ్గారెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డ నేతలు… కేసీఆర్ మాటవిని అక్రమంగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిఆంచారు. 2004లో ఎఫ్ఐఆర్ అయిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించిన ఉత్తమ్… 2004లో నమోదైన అక్రమ ఇమ్మిగ్రేషన్ కేసులో కేసీఆర్, హరీష్ రావు కూడా నిందితులుగా ఉన్నవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

SHARE