టెట్ వాయిదా..

203

The Bullet News ( Amaravathi ) – విద్యాశాఖ నిర్వహించతలపెట్టిన టెట్‌‌ పరీక్ష వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 14వేల ఉపాధ్యాయ పోస్టుల నియామానికి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, దీనికి ముందు టెట్ నిర్వహించాలని భావించింది. ఇందులో భాగంగా ఏపీ టెట్‌ను జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే సమయం తక్కువగా ఉందని విద్యార్థులు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం టెట్‌ను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి టెట్ జవనరి 17 నిర్వహించాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో ఫిబ్రవరికి వాయిదా పడింది. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు టెట్ నిర్వహించనున్నారు.

SHARE