తలాక్-మోదీ: మహిళా ఎమ్మెల్యే సంచలన ట్వీట్!

34

The bullet news (Delhi)_ ఎట్టకేలకు తలాక్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో వివాదాల సుడిగుండాలను దాటుకుని ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ లోక్‌సభలో నెగ్గింది. కాంగ్రెస్ కూడా మద్దతిచ్చిన ఈ బిల్లుపై ఇంకా కొంతమంది పెదవి విరుస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా త్రిపుల్ తలాక్‌ బిల్లును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు.

‘‘ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకు వెళ్తారు.. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు’’ అని మోదీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆల్కా లంబా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌కు మద్దతిస్తుండగా.. కొంతమంది విమర్శిస్తున్నారు. మోదీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన మీకు మోదీ గొప్పతనం గురించి ఏం తెలుసు?’ అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

SHARE