నెల్లూరుజిల్లా వైసీపీ కంచుకోట‌ని నిరూపించిన యువ‌త‌కు ధ‌న్య‌వాదాలు – జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షులు రూప్ కుమార్ యాద‌వ్

42

The bullet news (Nellore)_ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన జిల్లా యువ‌త‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, జ‌గ‌న్ అభిమానుల‌కు జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షులు రూప్ కుమార్ యాద‌వ్ కృత‌జ్ణ‌త‌లు తెలిపారు.. నెల్లూరు పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై యువ‌త‌కు ఎంత అభిమాన‌ముందో, అదే విధంగా ప్ర‌భుత్వంపై ఎంత వ్య‌తిరేక‌త ఉందో మొన్న‌టి జ‌గ‌న‌న్న కోసం స‌భ విజ‌య‌వంత‌మే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై యువ‌త ఆగ్ర‌హంతో ఉన్నార‌న్నారు.. నిన్న జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు సైతం యువ‌త‌ను విస్మ‌రించార‌న్నారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో బోలెడు హామిలిచ్చిన ఆయ‌న ఎన్నిక‌ల అనంత‌రం త‌న పాత స్టైల్ ను కొన‌సాగిస్తూ యువ‌త‌ను వెన్నుపోలు పొడిచార‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న యువ‌త జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్దంగా ఉన్నార‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE