చంద్రికను ఆమె తండ్రి అందుకే హత్య చేశాడు : ప్రేమికుడు

139

The bullet news (Crime)-  కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలో ప్రేమికుడితో కూతురు మాట్లాడుతుందన్న అనుమానంతో గొడ్డలి కర్రతో కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి.. బీటెక్‌ చదువుతున్న చంద్రిక అనే అమ్మాయి.. చాలాసేపటి నుంచి ఫోన్‌లో మాట్లాడుతుండడం గమనించిన ఆమె తండ్రి కోటయ్య.. విచక్షణా రహితంగా చేతిలో ఉన్న గొడ్డలి కర్రతో దాడి చేసి..  హతమార్చాడు. అయితే చంద్రిక మృతికి మరో రెండు కారణాలు కూడా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవలో వెళ్లడంతో జరిగిన పొరపాటు కారణంగా చంద్రికను హత్య చేసినట్టు భావిస్తున్నారు. మరోవైపు ఆమె ఫోన్‌లో మాట్లాడిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు అంగీకరించాడు. తమ ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు.

SHARE