ఆత్మకూరు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసింది నేనె – మాజీ మంత్రి ఆనం..

99

THE BULLET NEWS (ATMAKUR)-చంద్రబాబు సహకారంతో
ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఆనం రామనారాయణ వెల్లడించారు.. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆత్మకూరు మున్సిపాలిటి లోని 10, 16, 17 వార్డులలో పర్యటించారు.. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.. స్థానిక ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.. ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కలలు కంటున్నారని.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో పదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి గా ఉండాలన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు..

SHARE