.బ్యాంకుకు పైసాతో స‌హా చెల్లిస్తాం..మేయర్ కు దీంతో సంబంధం లేదు..

113

The bullet news (Nellore)_ రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు తమను బజారుకీడుస్తున్నారని నెల్లూరు నగర మేయర్ సోదరుడు, స్టార్ ఆగ్రో డైరెక్టర్ జలీల్ ఖాన్ అన్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన జలీల్.. స్టార్ ఆగ్రోకు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ కు సంబంధం లేదన్నారు.. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు తమ కుటుంబానికి రోడ్డుకీడుస్తున్నారని వాపోయారు.. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ప్రసాద్ జంపెక్స్ ను అప్రోచ్ అయ్యామని దాని వల్ల స్టార్ ఆగ్రోబయ్యర్లు, రైతుల్లో ఉండే నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. తమ కంపెనీ మీద దాదాపు వందల మంది వర్కర్స్, రైతులు ఆదారపడి జీవిస్తున్నారని వారందరి పొట్టకొట్టాలని కొందరు యత్నిస్తున్నారన్నారు..బ్యాంక్ లు నోటీసులు పంపిన మాట వాస్తవమేనన్న ఆయన ఆస్తుల జప్తు మాత్రం కాదన్నారు.. తమ ఆస్తులు అమ్మి అయినా సరే బ్యాంక్ లకు డబ్బులు చెల్లిస్తామన్నారు.. వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలోనే ప్రసాద్ జెంపెక్స్ తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్న మాట వాస్తమేనన్నారు..

SHARE