దారుణం…బావతో అక్రమ సంబంధం…భర్తను ఎలా చంపేసిందంటే

112

జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త నరేంద్రను భార్య శ్రీ విద్య హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 20న సాతులూరు వద్ద కెనాల్‌లో నరేంద్ర మృతదేహం లభ్యమైంది. దీంతో నరేంద్ర కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణజరపగా అసలు విషయం బయటపడింది. అక్క భర్త వీరయ్య చౌదరితో శ్రీవిద్యకు వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ దారుణ ఘటనకు ఆమె పాల్పడింది. మద్యంలో సైనైడ్ కలిపి భర్త నరేంద్రను భార్య చేంపేసింది. బావ వీరయ్య చౌదరి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య శ్రీవిద్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

SHARE