డిప్యూటీ డీఈఓ ఖాజా రహంతుల్లా ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి- ఎబివిపి డిమాండ్

144

THE BULLET NEWS (GUDUR)-విద్యా వ్యవస్థను శాసించే స్థాయికి ప్రయివైట్ విద్యా సంస్థలు చేరిపోయాయని, విద్యాశాఖాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రవైట్ స్కూల్స్ బరితెగించి ప్రవర్తిస్తుస్తున్నాయని నెల్లూరు జిల్లా ఎబివిపి కన్వీనర్ మనోజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. గూడూరు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రవైట్ స్కూల్స్ తీరుపై మండిపడ్డారు..

పుస్తకాలు, యూనిఫామ్ లు, విద్యా సామగ్రి పాఠశాలలో అమ్మకూడదని విద్యాశాఖాధికారులు, మౌలిక వసతులు లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ప్రవైట్ స్కూల్స్ కి చీమ కొట్టినట్లు కూడా లేదన్నారు. గూడూరు డివిజన్ లో కొన్ని స్కూల్స్ లో కనీస సౌకర్యాలు లేవన్నారు.. తల్లిదండ్రులు పుస్తకాలు కొనలేక అప్పులు చేయాల్సిన పరిస్థితికి స్కూల్స్ తీసుకొస్తున్నాయని మనోజ్ మండిపడ్డారు.. పాఠశాలలో కూడా సరైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడం లేదన్నారు..
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పెట్టుకొని విద్యాబోధన చేస్తున్నారని ఆరోపించారు.. ఇన్ని జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు..డిప్యూటీ విద్యాశాఖ అధికారి కి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.. పుస్తకాల దందాకు సహకరిస్తున్న గూడూరు ఉప విద్యాశాఖాధికారి ఖాజా రహ్మతుల్లాని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి చిన్న, నగర సహాయ కార్యదర్శులు కార్తీక్, జార్జ్, ఖలీల్, డివిజన్ సహ కార్యదర్శి రవి మరియు కార్యకర్తలు సుధీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు

SHARE