చేజ‌ర్ల పోలీస్ స్టేషన్ లో క‌త్తులు, క‌ర్ర‌ల‌తో వైసీపీ నాయ‌కుడు వీరంగం

279

The bullet news (Chejarla)-  అక్రమ మైనింగ్ వ్యాపారం అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది.. ఈ ఇరువర్గాల ఘర్షణ కు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ వేదికైంది.. పౌరులకు రక్షణ కల్పించే, రక్షణ నిలయంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వైసీపీ నాయ‌కులు ప్ర‌త్య‌ర్ది నాయ‌కుల‌పై దాడికి య‌త్నించారు.. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రం లో చోటు చేసుకుంది..

అక్రమ మైనింగ్ వ్యాపారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుల అనుచరులకు,స్థానిక టీడీపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది .వైఎస్సార్ సీపీ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటిే గౌతమ్ రెడ్డికి అనుచరులైన రమేష్ రెడ్డి,నారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు చేస్తున్న అక్రమ మైనింగ్ వ్యాపారంకి సంబంధించిన విషయాన్ని స్థానిక టిడిపి నాయకుడు “నజీర్ “మైనింగ్ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందిచాడన్న కారణంతో ఈ రెండు వర్గాల మధ్య గొడవలకు కారణమయ్యింది.మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఇటీవల లోడుతో వున్న ఒక లారీని సీజ్ చేశారు. ఈ నెపంతో ఒక వర్గం పై మరొక వర్గం వారు కేసు పెట్టుకొనుటకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వీరు పోలీస్ స్టేషన్ లోనే ఒకరిపై మరొకరు గొడవలకు దిగారు.గొడవలకు సిద్ధమై వచ్చిన వైయస్సార్ సీపీ నాయకుల అనుచరులు దుస్తుల లోపల, మారణాయుధాలతో స్టేషన్ లోకి ప్రవేశించి ప్రత్యర్థి వర్గం తో ఘర్షణకు దిగారు .ఘర్షణలను ఆపుటకు ప్రయత్నించినా పోలీస్ కానిస్టేబుల్ ని కూడా పక్కకు నెట్టేశారు.వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను సర్దిచెప్పుతున్నా,బూతులతో పరస్పరం దూషించు కున్నారు. సమయానికి స్టేషన్లో ఎస్ఐ లేకపోవడం ,ఆయన బందోబస్తు నిమిత్తం హైదరాబాదు వెళ్లడంతో ఇరు వర్గాల వారికి అవకాశంగా మారింది .

SHARE