20న జిల్లాకు సీఎం

356

THE BULLET NEWS :

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది.. ఈ నెల 20న ధర్మ పోరాట ధీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు రానున్నారు.. దీనికి సంబంధించి నగరంలోని నేషనల్ హైవే పక్కనే ఉన్న వేణుగోపాల్ స్వామి డిగ్రీ కాలేజి ప్రాంగణంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. సీఎం టూర్ కు సంబంధించి మంత్రి పొంగురు నారాయణ మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధర్మ పోరాట దీక్ష 13 జిల్లాలో నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు.. అందులో బాగంగా ఈ నెల 18న నెల్లూరు లో నిర్వహిస్తున్నామన్నారు.. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్ష జనాభా రానున్నట్లు ఆయన అంచనా వేశారు.. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని సాక్షాత్తు సీఎం దీక్ష కు దిగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు.. ఏపీ పై కేంద్రం చేస్తున్న కుట్రలను తెలుగు వారందరూ తిప్పికొట్టేందుకు ఇదో మంచి వేదిక అన్నారు..