వాళ్ల పాపాలు హరించుకునేందుకే నాపై విమర్శలు – మంత్రి సోమిరెడ్డి కామెంట్

155

The bullet news (Chittamuru)- వ్యవసాయం, సేద్యం అనే పదాలకు అర్దాలు తెలియని వారు కూడా నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిట్టమూరు మండలం ఈశ్వరవాకలో ఏరువాక కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ తో కలిసి మాగాణి పొలంలో పొంగళ్లు పొంగించి జోడెడ్లతో నాగలిపట్టి దున్నినవధాన్యాలు చల్లారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు..వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తెచ్చామన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తెచ్చిన ప్రభుత్వం తమ దేనన్నారు..రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. రైతుల కోసం పదేళ్లలో వాళ్ల ప్రభుత్వంలో చేసిన దానికన్నా ఈ నాలుగేళ్లలో నాలుగింతలు ఖర్చు పెట్టామని అవసరమైతే .ఆధారాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. వైకాపా నేతలతో పాటు ఆ పార్టీలో చేరాలనుకునే
వారికి తిట్టడానికి పాపాల భైరవుడిలా నేను దొరికానంటూ ఆయన వ్యాఖ్యానించారు.

SHARE