ద‌ళితుల అభ్యున్న‌తే టీడీపీ ధ్యేయం – సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

114

The bullet news (Sarvepalli)_  అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితెలిపారు. తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీలో చంద్రన్న ముందడుగు కార్యక్రమం నిర్వ‌హించారు.. చెన్నపల్లిపాళెం, కోడూరు, కొత్తకోడూరు ఎస్సీ కాలనీల్లో పర్యటించిన ఆయ‌న‌ డాక్టర్ శ్రీ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల‌మాలలు వేసి నివాళ్ల‌ర్పించారు.. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడారు.. దళిత యువతులకు ఉగాది పర్వదినం నుంచి రూ.40 వేలు పెళ్లి కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఆర్థిక కష్టాలను అధిగమించి రాజధాని నిర్మాణం, ద‌ళితుల కోసం సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌న్నారు. దళిత యువత విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికసాయం చేస్తున్న ఘ‌న‌త తెలుగుదేశం ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన మంత్రి సోమిరెడ్డి ఎక్కడ ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం తపిస్తుంటారని ఆయ‌న వెల్ల‌డించారు..

SHARE