The bullet news (Atmakur) – భార్య  మరొకరితో వెళ్లిపోయింద‌న్న‌ అవ‌మాన భారం ఓ వైపు.. తాను ఏమైనా చేసుకుంటే ముగ్గురు చిన్నారులు అనాథ‌ల‌వుతార‌నే భ‌యం మ‌రో వైపు.. వెర‌సీ ఓ అభాగ్య‌పు తండ్రి త‌న ముగ్గురు కూతుర్ల‌తో క‌లిసి బావిలో దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు.. ఈ సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చిన్నారులు మృతిచెంద‌గా మ‌రో చిన్నారితో పాటు తండ్రి చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.. ఈ విషాద ఘ‌ట‌న నెల్లూరుజిల్లా అనంత‌సాగ‌ర మండ‌లంలోని కామిరెడ్డిపాడు ద‌ళిత వాడ‌లో చోటు చేసుకుంది..

పోలీసులు, స్థానికుల క‌థ‌నం మేర‌కు
కామిరెడ్డిపాడు దళితవాడకు చెందిన పెంచలరత్నం ఉపాధి నిమిత్తం కువైట్ కు వెళ్లాడు.. అక్కడ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.. ఈ క్రమంలో ఆయన భార్య ప్రవర్తనపై అనుమానంతో ఇటీవల కామిరెడ్డిపాడుకు వచ్చాడు.. పెంచలరత్నం సమీప బంధువుతో చ‌నువుగా ఉంటుంద‌న్న గ్ర‌హించిన వెంక‌ట‌ర‌త్నం భార్య భానును నిల‌దీశాడు.. దీంతో వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు చోటు చేసున్నాయి.. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం భాను త‌న స‌మీప బంధువుతో వెళ్లిపోయింది.. ఈ అవ‌మాన భారాన్ని భ‌రించ‌లేని వెంక‌టర‌త్నం త‌న ముగ్గురు కూతుర్ల‌కు ఇవాళ మధ్యాహ్నం పురుగుల మందు తాపించి బావిలో తోసి తానూ దూకేశాడు.. దీంతో ఇద్ద‌రు కుమార్తెలు హ‌రిత (7), కీర్తి (6) మృతిచెందారు.. ఈ సంఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు కొనఊపిరితో ఉన్న‌ వెంక‌ట‌ర‌త్నం, మ‌రో చిన్నారి ప్ర‌మేమ కుమారిని ఆత్మ‌కూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.. సంఘటన సమాచారం అందుకున్న అనంతసాగర పోలీసులు,. ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి కామిరెడ్డికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

SHARE