విద్యార్దుల‌కు చుక్క‌లు చూపించిన ప‌క్షుల పండుగ ప్ర‌చార ర్యాలీ

138

The bullet news (Nellore)-  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంట‌.. అలా ఉంది ప‌క్షుల పండుగ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు.. ఇవాళ అధికారులు, మంత్రులు నిర్వ‌హించిన ప‌క్షుల పండుగ ప్ర‌చార ర్యాలీ విద్యార్దుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసింది.. వారికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ ప‌క్షులును చూద్దాం రండి అంటూ ప్ర‌భుత్వ అధికారులు, పాల‌కులు నిర్వ‌హిస్తున్న ప్ర‌చారాలు, చ‌దువుకునే విద్యార్థుల‌కు న‌ర‌కాన్ని చూపిస్తున్నాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారాల‌కు, పండుగల ర్యాలీల‌కు విద్యార్థుల‌ను ఆస‌రాగా చేసుకుంటున్న అధికారులు, పాల‌కులు వారి బాగోగులు ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా నెల్లూరు న‌గ‌రంలో ఫ్లెమింగో ఫెస్టివ‌ల్ ప్ర‌చారంలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన 5కె ర‌న్‌లో విద్యార్థులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. 5కె ర‌న్ ప్రారంభానికి గంట ముందే నెల్లూరు విఆర్‌సి సెంట‌ర్ వ‌ద్ద‌కుచేరుకున్న విద్యార్థులు ఇబ్బందులు ప‌డ్డారు. అధికారులు, మంత్రుల కోసం ఎదురు చూస్తూ ప‌డి గాపులు కాసారు. భానుడు ధాటికి త‌ట్టుకోలేక పిట్ట‌ల్లా అల్లాడారు. క‌నీసం టూరిజం శాఖ అధికారులు 5కెర‌న్‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన విద్యార్థుల‌కు మంచినీటి వ‌స‌తి కూడా క‌ల్పించ‌క‌పోవ‌డంతో అల్లాడిపోయారు. 5వేల మంది విద్యార్థులు ఈ 5కె ర‌న్‌కు వ‌స్తే, కేవ‌లం వెయ్యి మందికి మాత్ర‌మే మంచినీరు అదించారంటే, అధికారులు నిర్ల‌క్ష్యం ఏ పాటిదో అర్థ‌మైపోతోంది. చెమ‌ట‌లు క‌క్కుతు విద్యార్థులు 5కెర‌న్‌లో పాల్గొన‌గా, కొంద‌రు, ఇదేమి క‌ష్టం, స్కూలో కుర్చుని చ‌దువుకోవాల్సి తాము, రోడ్ల‌పై ఇలా ర్యాలీలు చేయ‌డం ఏమిటంటూ ఆవేద‌న చెంద‌డంతోపాటూ, 5కెర‌న్ నుంచి మ‌ధ్య‌లోనే నిష్క‌ర‌మించ‌డం గ‌మ‌నార్హం

SHARE