తొలిరేయి.. కలయిక భయం పోయేదెలా..?

160

The bullet news (Sex)_ పెళ్లయ్యాక తొలి రేయి వేళ భర్తతో ఏకాంతంగా గడపాలని అమ్మాయిలు కోరుకుంటారు. కానీ వారిని నొప్పి భయం వెంటాడుతుంది. ఓవైపు ఆతురత, మరోవైపు భయంతో నవ వధువు డోలాయమానంలో ఉంటుంది. వాస్తవానికి అందరికీ తొలి కలయికలో నొప్పి రావాలని, రక్త స్రావం అవుతుందని చెప్పలేం. తొలి కలయిక సాఫీగా సాగిపోవాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే సరి.

తొలి రాత్రి ముందు ఆందోళనను తగ్గించుకోవడం ఉత్తమం. ప్రశాంతంగా ఉండటం కష్టమే కానీ కూల్‌గా ఉండకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిలాక్స్‌ ఉండటమే బెటర్. తొలి కలయిక సమయంలో యోని పై భాగంలో ఉండే హైమన్ పొర చిట్లుతుంది. ఫలితంగా రక్తస్రావం అవుతుంది అని చాలా మంది భావిస్తారు. కానీ హైమన్ పొర మందంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. అంతే కాకుండా సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, బైక్ రైడింగ్ లాంటి పనులు చేసే అమ్మాయిల్లో ఈ పొర ముందే చిరిగిపోయే అవకాశాలే ఎక్కువ. కానీ ఆ విషయం వారికి తెలియదు. కాబట్టి తొలి కలయికలో రక్తస్రావం కావడం, కాకపోవడం అనేది అంతగా పట్టించుకోవాల్సి విషయమేం కాదు. మొదటి రాత్రే అంతా సాఫీగా సాగిపోవాలని, పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం సినిమాల్లో సాధ్యం కావచ్చు. కానీ బయట మాత్రం అలా సాధ్యం కాదు. కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఇద్దరిలోనూ భయాల కారణంగా ఇలా జరగొచ్చు. కాబట్టి అంతా పర్ఫెక్ట్‌గా సాగాలని కోరుకోవద్దు. ఒత్తిడి, తీవ్ర అలసట, బిగుసుకుపోవడం కారణంగా కలయిక సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లూబ్రికెంట్లను వాడండి.

శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ భావప్రాప్తి పొందడం తేలికేం కాదు. చాలా మంది తొలి కలయికలో భావప్రాప్తి పొందరనేది నిజం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి తొలిరేయిలో ఆనందం మీ సొంతం కాలేదని బాధపడాల్సిన అవసరం లేదు.

పెళ్లయ్యాక తొలి రేయి వేళ భర్తతో ఏకాంతంగా గడపాలని అమ్మాయిలు కోరుకుంటారు. కానీ వారిని నొప్పి భయం వెంటాడుతుంది. ఓవైపు ఆతురత, మరోవైపు భయంతో నవ వధువు డోలాయమానంలో ఉంటుంది. వాస్తవానికి అందరికీ తొలి కలయికలో నొప్పి రావాలని, రక్త స్రావం అవుతుందని చెప్పలేం. తొలి కలయిక సాఫీగా సాగిపోవాలంటే.. ఈ చిట్కాలను పాటిస్తే సరి.

తొలి రాత్రి ముందు ఆందోళనను తగ్గించుకోవడం ఉత్తమం. ప్రశాంతంగా ఉండటం కష్టమే కానీ కూల్‌గా ఉండకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిలాక్స్‌ ఉండటమే బెటర్.
ఒక్కోసారి తొలి రేయిలో శృంగారమే సాధ్యం కాకపోవచ్చు. పెళ్లి పనుల్లో పడి ఇద్దరూ చాలా అలసిపోయి ఉండొచ్చు. కాబట్టి శోభనం రాత్రి కలయిక సాధ్యం కాకపోయినా నిరుత్సాహపడొద్దు. తొలిరేయి రోజు కబుర్లతోనే ముగించే జంటలు ఎన్నో. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం శారీరకంగా ఏకం కావడం కంటే ఎంతో ముఖ్యం.

శృంగారంలో పాల్గొన్నా, పాల్గొనకున్నా.. తొలి రేయి ఎంతో మధుర క్షణాలను మిగిల్చేలా చూసుకోండి. భాగస్వామితో చక్కగా మనసు విప్పి మాట్లాడుకోవడం, నవ్వడం, ఆలోచనల్ని పంచుకోవడం చేయండి. ఇలా చేయడం వల్ల తొలి రేయి ఇద్దర్నీ మరింత దగ్గర చేస్తుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి భయాలను పక్కనబెట్టి శారీరకంగా కలిసినా, కలవకపోయినా.. తొలిరాత్రిని ఎంజాయ్ చేయండి.

SHARE