సీఎం వేసిన పునాదిరాళ్లు సమాధి రాళ్లుగా మిగిలిపోతున్నాయి – ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి పైర్

126

The bullet news (Nellore)- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి నెల్లూరుజిల్లా పర్యటనపై సర్వేపల్లి ఎమ్మెల్యే,వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు.. అధికార దుర్వినియోగానికి సీఎం పర్యటన పరాకాష్టగా మారిందని ధ్వజమెత్తారు.. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. సీఎం పర్యటనకు విద్యార్దులను పావుగా వాడుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు పర్యటన ఉన్నందున స్కూళ్లకు సెలవులివ్వాంటూ కలెక్టర్, డిఈవో, డిటీసీల పేరు మీద ప్ర‌యివేట్ వ్య‌క్తులు స్కూల్ యాజ‌మాన్యానికి మెసేజెస్ పంపారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై కేసులను నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. గతంలో చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు..2016లోపు సంగం బ్యారేజి పూర్తి చేస్తామన్న హామీ ఏమైందన్నారు.. చంద్రబాబు వేసిన పునాది రాళ్లు సమాధి రాళ్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. స్వర్ణముఖి లింక్ కెనాల్ ,బకింగ్ హామ్ కాలువ నిర్మాణం వాగ్దానాలకే పరిమిత‌మ‌య్యాయని మండిపడ్డారు. కిష్ణపట్నం పోర్టును రాజశేఖర్ రెడ్డి అభివ్రుద్ది చేస్తే దాన్ని బాబు తన ఖాతాలో వేసుకున్నారని దుయ్యబట్టారు..

SHARE