ఫ‌లించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ పోరాటం- రైతుల్లో ఆనందం

128

The bullet news (Gudur)_  ఎండిపోతున్న పొలాల‌కు ఆ ఎమ్మెల్యేలు అండ‌గా నిల‌బ‌డ్డారు.. తాగు, సాగునీటి కోసం వారు చేసిన పోరాటం ముఖ్య‌మంత్రిని క‌దిలించింది.. రైతుల మ‌నస్సును సైతం గెలుచుకుంది.. నెల్లూరు జిల్లా దక్షిణ ప్రాంతం తాగు,సాగునీటి అవసరాలకు ఆసరా లభించింది.. నీళ్లు లేక ఎండుతున్న దక్షిణ ప్రాంతాల రైతుల‌కు గంగనీరు దగ్గరవుతోంది.. కండలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో మొన్న నెల్లూరొచ్చిన ముఖ్యమంత్రికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కిష్ణ, ఆ నియోజ‌క‌వ‌ర్గ రైతులు మొరపెట్టుకున్నారు.. దాంతో శ్రీశైలం నుంచి 5.5 టీఎంసీ నీటిని సోమశిలకు పంపుతున్నారు.. ఇవాళ ఆ నీటిని కండలేరుకు మళ్లీంచారు.. తెలుగు గంగలో అంతర్బాగమైన కండలేరు జలాశయానికి సోమశిల నుంచి నీటి పంపిణీ ప్రారంభమైంది.. ప్రస్తుతం కండలేరు జలాశయంలో ఉన్న నీటిని నెల్లూరుజిల్లా దక్షిణ ప్రాంతంలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న కండలేరు, స్వర్ణముఖి, కైవల్య, కాళంగి నదుల ద్వారా పరివాహకాలకు పంపుతారు.. దీంతో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ముఖ్య‌మంత్రికి, మంత్రులుకు కృత‌జ్ణ‌త‌లు తెలిపారు..

SHARE