గ్రామ స్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా…

95

The Bullet News ( Atmakuru ) _ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి కృషి చేస్తున్నారని మర్రిపాడు టీడీపీ మండలాధ్యక్షులు శాకమూరి నారాయణ తెలిపారు.. డీసీపల్లి పంచాయతీలోని గంగధర్ల కాంఫౌండ్ లో ఇవాళ మండల కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శాకమూరి నారాయణ మాట్లాడుతూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం వల్ల గ్రామస్థాయిలో ఉండే అనేక సమస్యలను గుర్తించామన్నారు.. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధిష్టానానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.. ముఖ్యంగా మర్రిపాడు సెంటర్ నుంచి ఊళ్లో వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, బోర్లు మరమ్మత్లు. వృద్దులు వితంతువులకు ఫించన్లతో పాటు సోమశిల హైలెవల్ కెనాల్ సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు గిట్టుబాటు ధర తదితర అంశాలను మండల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు క్రుష్ణారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

SHARE