ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీటవేస్తోంది..

90

The bullet news (Nellore)- ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. అంబెడ్కర్ 127 జయంతిని పురస్కరించుకుని నెల్లూరు వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, మేధావిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. సీఎం చంద్రబాబు సీఎం అయ్యాక దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు.. అమరావతిలో అంబేద్కర్ ఎత్తైన భారీ విగ్రహాన్ని కోట్లాది రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.. ప్రజాసంఘాలు, దళిత నాయకుల ఆధ్వర్యంలో లో కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…

SHARE