గూడూరు ఎమ్మెల్యే సునీల్ ను క‌లిసి కృత‌జ్ణ‌త‌లు తెలిపిన ఉపాద్యాయ సంఘ నాయ‌కులు

81

The bullet news (Gudur )- ప్ర‌జా స‌మస్య‌ల‌ను గుర్తించ‌డం.. వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డంతో గూడూరు ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని అమలు చెయ్యాలని వారు చేస్తున్న డిమాండ్ ను ఎమ్మెల్యే సునీల్ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ వేదిక‌గా వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి వివ‌రించారు..దీంతో త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే సునీల్ ను ఉపాద్యాయ సంఘాలు ఘ‌నంగా స‌త్క‌రించారు.. ఇవాళ ఉద‌యం ఎమ్మెల్యేను క‌లిసిన ఆ సంఘ నాయ‌కులు పుష్ప‌గుచ్చం ఇచ్చి కృత‌జ్ణ‌త‌లు తెలిపారు.. అనంత‌రం ఎమ్మెల్యే గూడూరు స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక‌కు హజ‌రై ప్ర‌జల‌నుంచి అర్జీలు స్వీకరించారు.. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిపల్ ఛైర్-పర్సన్ పొణకా ధేవసేన, ఆర్డీవో అరుణ్ బాబు, గూడూరు ఏఎంసీ చైర్మన్ బొల్లినేని కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు..

SHARE