ఎమ్మెల్యే చెంప‌చెల్లుమనిపించిన కానిస్టేబుల్

69

The bullet news (Simla)-  సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓ ఎమ్మెల్యే మహిళా కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించింది. అందరి ముందు ఆమెను చెంపదెబ్బ కొట్టింది. వెంటనే మహిళా కానిస్టేబుల్‌ కూడా ఎమ్మెల్యేను కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి పాలవడానికి గల కారణాలను చర్చించేందుకు శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిమ్లా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆషా కుమారి కూడా వచ్చారు. అయితే.. ఆమెను సమావేశం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన ఎమ్మెల్యే వెంటనే ఆమెను ఆపిన మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీయడంతో బయటకు వచ్చింది. పంజాబ్‌ ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా ఆషాకుమారి ఉన్నారు. ఇటీవల జరిగిన హిమాచల్‌ ఎన్నికల్లో ఆమె తన స్వస్థలమైన డల్హౌసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 21 స్థానాల్లోనే గెలుపొందింది.

SHARE