ఎమ్మెల్యే చొరవతో బాధితునికి న్యాయం

148

The bullet news (Podalakuru)_ రెవెన్యూ అధికారుల ధనదాహానికి ఓ బాధితునికి రావాల్సిన నష్టపరిహారం గల్లంతైంది.. లక్షల రూపాయాలు గుట్టుచప్పుడు కాకుండా బొక్కేశారు.. నష్టపరిహారం చల్లించాలంటూ రెండేళ్లు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఆ బాధితున్ని పట్టించుకోలేదు.. దీంతో ఆ బాధితుడు ఎమ్మెల్యేని కలిసి తన గోడును
వెల్లబోసుకున్నాడు.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధితునికి గంటల వ్యవధిలోనే నష్టపరిహారం అందేలా
చేశారు.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఎమ్మెల్యే చొవరతో న్యాయం జరిగిన బాధితుడు ఏమంటున్నారు..? ఈ
వ్యవహారంపై ఆ మండలంలో జరుగుతున్న చర్చేంటి..? వాచ్ దిస్ స్టోరీ..

పొదలకూరు మండలం కంభాలపల్లికి చెందిన మల్లిక సుబ్బయ్య కు సర్వేనెంబర్ 504/5 లో 2.35
ఎకరాలభూముంది.. ఇందులో 1.14 ఎకరాలభూమిని రెండేళ్ల క్రితం ఓబులాపురం-కృష్ణపట్నం రైల్వే లైన్ లో
సేకరించారు. నిర్మాణ పనులు సైతం జరుగుతున్నాయి.. ఈ విషయం రైతు సుబ్బయ్యకు ఆలస్యంగా
తెలిసింది. పరిహారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ రెండేళ్ల పాటు కాళ్లరిగేలా తిరిగాడు. అధికారుల నుంచి
ఎలాంటి స్పందనా లేదు.. దీంతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి నిర్వహించిన గ్రీవెన్స్ డేలో
ఎమ్మెల్యేను కలిసి తన గోడును వెల్లబోసుకున్నాడు.. దీంతో ఎమ్మెల్యే కాకాణి రైల్వే లైన్ భూముల సేకరణకు సంబంధించిన ఫైల్ ను అధికారుల ద్వారా గంటసేపు దగ్గర ఉండి మరీ తీసి పరిశీలించారు.. దీంతో రెవెన్యూ అధికారుల బాగోతం బయటపడింది. సుబ్బయ్య పొలం పరిహారాన్ని కొమ్మల వెంకటయ్య అనే రైతుకు చెల్లించారు. కొమ్మల వెంకటయ్య పరిహారాన్ని ఆయనకు గతంలో పొలం అమ్మిన ఈశ్వరమ్మకు చెల్లించినట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉంది..

ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల చేతివాటం బయటపడింది.. రైతు వెంకటయ్యకు నష్టపరిహారం
చెల్లించకుండా సొమ్ముకు కాజేసేందుకు ఈశ్వరమ్మ పేరుపై వచ్చిన చెక్కును ఆమెను బెదిరించి అధికారులు
కాజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఇన్ చార్జి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.. తహశీల్దార్ ద్వారా జేసీ
సమ్రగ నివేదిక తెప్పించుకోవడంతో క్రిమినల్ కేసులు నమోదవతాయనే భయంతో రెవెన్యూ అధికారులు
బాధితునికి నగదు చెల్లించేందుకు ముందుకొచ్చారు.. దీంతో అధికారులు ఎమ్మెల్యే కాకాణి సూచన మేరకు
అసలు రూ.5 లక్షలు, దానికి రెండున్నర సంవత్సరాలకు వడ్డీ రూ.1.50 లక్షలు మొత్తం రూ.6.50 లక్షలు
గిరిజనుడికి చెల్లించి రాజీకుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు సుబ్బయ్య ఆనందానికి అవధుల్లేవు.. రెండేళ్ల
నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఉన్నతాధికారులను, మంత్రులను కలిసినా పరిష్కారం కాని సమస్య
ఎమ్మెల్యే చొవరతో అయ్యిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. తమ కుటుంబం జీవితాంతం
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని సుబ్బయ్య అన్నాడు..

దీనిపై ఆ మండలంలో పెద్ద చర్చే నడుస్తోంది.. ప్రజలకు సేవచేయాలనే సంకల్పం ఉంటే ప్రతిపక్షంలో ఉన్నా
చెయ్యొచ్చని ఎమ్మెల్యే కాకాణి నిరూపిస్తున్నారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆ మండల
ప్రజలు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివుద్ది
కార్యక్రమాలకు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.. ఏదేమైనా సుబ్బయ్యకు న్యాయం చేయడంలో
కాకాణి తీసుకుని చొరవకు పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారు..

SHARE