మునిసిపల్ స్కూల్స్ లోనే నాణ్యమైన విద్య అందుతుంది – నగర మేయర్ అబ్దుల్ అజీజ్

82

The bullet news (Nellore)-  కార్పోరేట్ స్కూల్స్ లో కంటే మునిసిపల్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్సార్) నిధులతో నగరంలోని అన్ని మున్సిపల్ పాటశాలల్లో అధునాతన సదుపాయాలను కల్పించి, ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తామని ఆయన వెల్లడించారు.. నగరంలోని స్టోన్ హౌస్ పేటలోని ఆర్ ఎస్సార్ మున్సిపల్ పాటశాలలో విద్యార్దులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు.. మేయరు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్ధులు మున్సిపల్ పాటశాలల్లో చదువుకుని దేశం గర్వించే ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. పేదరికం వల్ల ఏదీ సాధించలేము అన్న అపోహను విద్యార్ధులూ, తల్లితండ్రులు వదిలేసి, ప్రభుత్వం అందిస్తున్న నిర్భంద ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలూ, మంత్రి నారాయణల సహకారంతో నగరంలోని మున్సిపల్ పాటశాలల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయరు చెప్పారు. అందులో భాగంగానే విద్యార్ధుల సౌకర్యార్ధం పాఠశాలల్లో నాణ్యమైన బల్లలూ, ఈ లైబ్రరీ, ఈ తరగతి గదులు, అధునాతన మరుగుదొడ్లు, మినరల్ వాటర్ సిస్టం, అన్ని విభాగాల లాబొరేటరీస్, పౌష్టికరమైన మద్యాహ్న భోజనం, చిరుతిండ్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామని మేయరు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అనూరాధా, ప్రభుత్వ వైద్యశాల అభివృధ్ధి కమిటీ చైర్మెన్ చాట్ల నరసింహారావు, నాయకులు షంషుద్దీన్, మాదాల వెంకటేశ్వర్లు, అంచెల వాణీ, విజేత, పాటశాలల ప్రధానోపాధ్యాయులు మధు, పద్మనాభం, వెంకట్రావు, నర్సింహులు, అనసూయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SHARE