మేక‌పాటి నివాసంలో ఘ‌నంగా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు

112

The bullet news (Udayagiri)_  అభిమానులు, కార్య‌క‌ర్త‌ల మ‌ద్య ఉద‌య‌గిరి మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నూత‌న సంవత్స‌ర వేడుకులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు.. ఆయ‌న నివాసంలో నందిపాడుకు చెందిన వాల్మీకి నాయ‌కులు, యువ‌నాయ‌కులు కావ‌లి సునీల్ ఆధ్వ‌ర్యంలో కార్య‌క‌ర్త‌లు ఆయ‌న్ని క‌లిసి పూల‌బొకే అంద‌జేశారు.. అనంత‌రం ఆయ‌నకి శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా కావ‌లి సునీల్ మాట్లాడుతూ కొత్త సంవ‌త్స‌రంలో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల ప‌క్షాన మ‌రిన్ని పోరాటాలు చేయాల‌న్నారు.. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటికి భ‌గ‌వంతులు ఆయుఆరోగ్యాలు ప్ర‌సాదించాలని ఆయ‌న ఆకాంక్షించారు.. మేకపాటి నాయ‌క‌త్వంలో వైసీపీ బ‌లోపేతానికి తామంతా పాటుప‌డ‌తామ‌న్నారు..

SHARE