గుడ్డు పగిలిందంటూ అంబులెన్స్‌కు ఫోన్

79

The bullet news(eggggg)-ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు పగిలిపోయిందని ఓ మహిళ హడావుడిగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో చెప్పండని సలహా కోరింది. ఈ ఘటన బ్రిటన్‌లోని నాటింగ్హమ్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ అధికారులు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఒక మహిళ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ మహిళ నాకు మీ నుంచి ఓ సలహా కావాలని అని అడిగింది. ఏం కావాలి ప్రశ్నించగా ‘మా ఫ్రిజ్‌లోని ఒక బాక్సులో నిండా గుడ్లు ఉన్నాయి. అందులో ఒకటి పగిలిపోయింది. దీంతో ఆ బాక్సును రాత్రంతా తెరిచే ఉంచాను. గుడ్ల బాక్సును అలా ఫ్రిజ్‌లో తెరిచి ఉంచవచ్చా?’ అని అడిగింది. ఇది విన్న అధికారులు ఇది అంబులెన్స్‌ సర్వీస్‌ అని.. అత్యవసరమైతేనే ఫోన్‌ చేయాలని ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు అధికారులు ఈ కాల్‌ రికార్డింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

SHARE