కావ‌లిలో పందులు స్వైర విహారం – ఒక‌రిపై దాడి

110

The bullet news (Kavali)-  కావలి ప‌ట్ట‌ణంలో పందులు స్వైర‌విహారం చేస్తున్నాయి.. చిన్నారులు, వృద్దులు బ‌య‌ట తిర‌గాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇవాళ ఉద‌యం ప‌ట్ట‌ణానికి చెందిన బీబీజాన్ అనే 65 ఏళ్ల మ‌హిళ‌పై అయ్య‌ప్ప గుడి సమీపంలో పంది దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయప‌డిన ఆమెను స్థానికులు కావ‌లి ప్ర‌భుత్వ వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. మునిసిపాల్టీ అధికారులు నిర్లక్ష్యంతో పందులు స్వైర‌విహారం చేస్తున్నాయ‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. తాము ఎన్నిసార్లు పిర్యాదు చేసినా అధికారులు స్పందించ‌లేద‌ని వారు వాపోతున్నారు.

SHARE