ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం- ఎమ్మెల్యే కురుగొండ్ల‌

106

The bullet news (Venkata giri)- పెద్ద‌మ్మ.. మీకు నెల‌నెలా స‌రిగ్గా ఫించ‌న్ వ‌స్తుంది క‌దా.?  స‌ంక్షేమ ప‌థ‌కాలు అన్ని అందుతున్నాయి క‌దా..?  ఏమైనా స‌మ‌స్య‌లుంటే చెప్పు నేను ప‌రిష్క‌రిస్తానంటూ వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ  సైదాపురం మండలం దేవర వేమూరు పంచాయితీ పరిధిలోని కట్టుబడి పల్లి ఎస్పీ కాల‌నీలో  ఓ వృద్దురాలితో మాట్లాడారు.  ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్రమంలో భాగంగా ఇవాళ ఆయ‌న సైదాపురం మండ‌లంలోని  క‌లిచేడు, త‌దిత‌ర గ్రామాలలో పర్యటించారు.. స్థానికుల‌ను అడిగి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఈ గ్రామాల్లో ఆయ‌న స్కూటీపై  కాల‌నీలో క‌లియ‌తిరిగారు.. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ  తెలుగుదేశం ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమ‌మే ద్యేయంగా ప‌నిచేస్తోంద‌న్నారు.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గా అభివృద్ది కోసం చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నేత‌లు పాల్గొన్నారు. అంత‌కుముందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఆయా గ్రామాల ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు..

SHARE