ప్రశ్నిస్తే పనులు చెయ్యం…కోవూరు అధికారుల నయా స్టైల్.

114

The bullet news (Kovuru)- హేయ్.,. గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు.. ఈ ఫేమస్ డైలాగ్ ను ఫాలో అవుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలాధికారులు.. మాకు కుదిరిన‌ప్పుడే ప‌నులు చేస్తాం.. మీరు కూడా అప్పుడే ప‌నులు చేయించుకోవాలి.. మీరు చెప్పగానే పనులు చేయాలా..? ప్రశ్నిస్తే అసలు పనులు చెయ్యం అంటూ ప్రజలపై ఒంటికాలిమీద లేస్తున్నారు అక్కడి ఎంపీడీవో జాలిరెడ్డి, ఈవోపిఆర్డీలు.. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చూడండి.. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చూడండి..

పడుగుపాడులో పారిశుద్ద్యంలో అటకెక్కింది.. పారిశుద్యం అద్యానంగా ఉందని స్థానికులు అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లినా వారి నుంచి స్పందన మాత్రం రావడంలేదు.. సైడ్ కాలువల్లో నుంచి మురికి నీరు రోడ్లకుపైకి, సమీప ఇళ్లల్లోకి ప్రవహిస్తున్నా… అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.. గతంలో పడుగుపాడులో అటకెక్కిన పారిశుద్యమంటూ బుల్లెట్ న్యూస్ లో వార్తం రావడంతో అధికారుల్లో చలనం వచ్చింది.. హుటాహుటిన చిన్న కాల్వల్లో మురికిని తొలగించి ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పత్తాలేకుండా పోయారు.. స్థానికులు ఈ విషయాన్ని ఎంపీడీవో ద్రుష్టికి తీసుకెళ్తే ఆయన ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. ప్రశ్నిస్తే పనులు చే్స్తారా..? చేస్తాములే అంటూ ఆయన బదులిచ్చారు.. కోవూరు మండలాధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అధికారులు పనిదొంగల్లా తయారయ్యారని వారు మండిపడుతున్నారు. చూద్దాం.. ఇప్పటికైనా అధికారుల్లో చలనం వస్తుందో రాదో.. అప్పట్లో వార్తకు స్పందించి కంటితుడుపు చర్యలకు దిగారు.. చిన్న కాలువల్లో చెత్తను తొలగించారు.. పెద్ద కాల్వల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది.. రేపో మాపో అంటూ కాలయాపన చేస్తున్నారు.. కాలువలోని పొంగి రోడ్ల మీదకు, ఇళ్లలోకి పారుతున్నాయి.. స్థానికులు ప్రశ్నిస్తే చూద్దాం.. చేద్దాం అనే సమాధానం వస్తోంది.. పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ మొఖం చాటేశాడు.. ప‌నిచేయ‌డం చేత‌గాని అధికారులు త‌ప్పుకుంటే వారి స్తానంలో వ‌చ్చే వారైనా చేస్తారు క‌దా.. అలా త‌ప్పుకోకుండా ప్ర‌జ‌లను ఇబ్బంది పెట్టడం స‌రైన ప‌ద్ద‌తి కాద‌నేది ప‌లువురి అభిప్రాయం.. ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే సీట్ లోని కూర్చొని వాళ్ల‌కు ప‌నులు చేయ‌కుండా నెల నెల జీతాలు తీసుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌నేది అక్క‌డి స్థానికులు చర్చించుకుంటున్నారు.. రాజ‌కీయ నాయ‌కుల్ని అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.. స్వామి సేవలో త‌రించే వారికి ఉద్యోగాలు అవ‌స‌ర‌మా అంటూ ప‌డుగుపాడు వాసులు మండిప‌డుతున్నారు.. 

SHARE