వారి అభిమానమే కారణం – మాజీ మంత్రి ఆనం

99

The bullet news (Atmakuru)- దశాబ్దాలుగా తాను విజయవంతమైన నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉండటానికి కార్యకర్తల అండదండలు, వారి అభిమానమే కారణమని మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.. రైతన్నకు తోడుగా రైతురథం కార్యక్రమంలో ఇవాళ మర్రిపాడు మండల పరిధిలో జరిగింది.. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, మాజీ శాసన సభ్యులు కంభం విజయరామి రెడ్డి తో కలిసి బీసీ కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాదన్నారు..వారిని విస్మరించకుండా వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.. 2019లో మ‌రోసారి తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు..

SHARE