ఈ నెల 4న కండలేరు జలాశయం నుంచి 5 టీఎంసీల నీరు విడుదల – వెల్లడించిన ఎమ్మెల్యే కురుగొండ్ల, పాశం సునీల్

111

The bullet news (Amaravathi)_వెంకటగిరి, గూడూరు నియోజకవర్గ రైతుల కాంక్ష తిరబోతోంది.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పోరాటానికి ఫలితం దక్కబోతోంది.. ఎప్పుడెప్పుడూ అని ఆ ప్రాంత రైతులు ఎదురుచూస్తున్న కండలేరు జలాశయ నీటికి విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకిష్ణ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ తెలిపారు.. ఇవాళ అమరావతిలో వారు మాట్లాడుతూ గత కొద్ది నెలలుగా తాము పడుతున్న శ్రమకు ప్రతిఫలం త్వరలోనే దక్కబోతుందన్నారు.. కండలేరు జలాశయం నుంచి చెన్నైకి 5 టీఎంసీ నీరు పోనూ మిగిలిన వాటిలో 5 టీఎంసీలు నీటిని ఈనెల 4వ తేదీన విడుదల చేయునున్నట్లు వారు తెలిపారు.. 5 టీఎంసీలు నీటిని విడుదల చేయడం ద్వారా ఆ డెల్లా ప్రాంతంలోని చెరువులకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు.. రైతులు కూడా దైర్యంగా పంటలు వేసుకోవచ్చన్నారు.. రైతుల‌కు నీరు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ వెంక‌ట‌గిరి వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రేపు కండలేరు రెగ్యులేట‌ర్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు రైతుల‌కు తీపి క‌బురు అందించారు..

SHARE