ఫ‌లించిన గూడూరు ఎమ్మెల్యే కృషి – పంచాయ‌తీ రాజ్ నుంచి రూ.1.88ల‌క్ష‌లు విడుద‌ల‌

91

Thebullet news (Gudur)_గూడూరు నియోజ‌వ‌ర్గంలోని రోడ్ల‌కు, వార‌ట్ ట్యాక్ల నిర్మాణాల‌కు పంచాయ‌తీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ నిధులు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మీడియాకు వివ‌రించారు.. ఎస్ సీసీ ప్రాజెక్టులో చిల్లకూరు మండలం చేడిమాలలోని రోడ్ల దుస్థితిని నారా లోకేష్ దృష్టికి గతంలో తీసుకెళ్లాన‌న్నారు.. దాంతో వాటి నిర్మాణాలకు రూ.79లక్షలు విడుద‌ల చేశార‌న్నారు.. దాంతో పాటు ఆర్ డ‌బ్ల్యూఎస్ శాఖ‌లో కోట మండలం ఊనుగుంటపాళెం, చిట్టేడు మైక్రోటవర్ కాలనీ, గూడూరు మండలం పాత తుంగపాళెం, చిట్టమూరు మండలం చిల్లమూరు రామారెడ్డి కండ్రిగ గ్రామాలకు నాలుగు వాట‌ర్ ట్యాంకుల‌కు గానూ రూ. 1.09కోట్లు విడుద‌ల చేశార‌న్నారు.. మొత్తంగా త‌న విజ్ణ‌ఫ్తిని ప‌రిశీలించి రూ. కోటి 88 లక్షలు మంజూరు చేసిన మంత్రి నారాలోకేష్ కు ఆయ‌న ప్ర‌త్యేక కృత‌జ్ణ‌త‌లు తెలిపారు..

SHARE